LIVE
చంద్రబాబు కేంద్ర పదవి చేపడితే సీఎం పోస్టులో కూర్చునేదెవరు..?
వెనక్కి

చంద్రబాబు కేంద్ర పదవి చేపడితే సీఎం పోస్టులో కూర్చునేదెవరు..?

44 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

బీహార్ సీఎం నితీష్ కుమార్ మాదిరిగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా హస్తినలో కీలక పదవి చేపడతారని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకవేళ చంద్రబాబు ఢిల్లీకి వెళితే లోకేష్‌ను సీఎం పీఠంపై కూర్చోపెట్టటం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. అయితే.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేనాని దీనికి అంగీకరిస్తారా..? లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించి పని చేస్తారా..? అనే ఆసక్తికర ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. చంద్రబాబు నాయకత్వాన్ని అంగీకరించినంత ఈజీగా లోకేష్ నాయకత్వాన్ని పవన్ అంగీకరించరని చాలా మంది అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కూటిమి నుంచి బయటకు వచ్చి తన దారి తాను చూసుకుంటారని మరికొందరు జోస్యం చెబుతున్నారు. మొత్తం మీద బీహార్ రాజకీయ పరిణామాలు ఏపీలో చర్చనీయాంశంగా మారటం ప్రాధాన్యం సంతరించుకుంది.

షేర్ చేయండి:
6 మార్చి, 2026 02:57 PMకి